దేవరకద్ర: దేవరకద్రలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ద్వామా పీడీ...
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేవరకద్ర మండల కేంద్రంలోని యుపిఎస్సి పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ద్వామా పీడీ నర్సింలు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని సక్రమంగా పూర్తి చేయాలని,ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాసులు కార్యనిర్వాహణాధికారి సీత నాయక్ తదితరులు ఉన్నారు.