గుత్తి కోట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారా తెరిచారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు గుమ్మడికాయ కొట్టి నాలుగు గంటల సమయంలో ఉత్తర ద్వారా అన్ని తెరిచారు. చేతిలో కర్పూరం వెలిగించి పూజలు చేశారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి నినాదాలతో ఆలయం మారుమ్రోగిపోయింది. ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది.