ఒంగోలు: రానున్న ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు టీడీపీ విజయానికి సహకారం అందించాలి: నగరంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో బెంగళూరు టీడీపీ ఫోరం ఐటీ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఐటి ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు టీడీపీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. మరోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.