దుబ్బాక: ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది - దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే మార్కెట్ యార్డు కు వెళ్లి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక లేదని ఆరోపించారు. ఒక్కో రైతు పదిహేను రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని వాపోయారు.