అదిలాబాద్ అర్బన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే గ్రామాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కార్డెన్ అండ్ సెర్చ్ లను నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఉదయం ఐదు గంటల నుండి 160 మంది సిబ్బందితో ఉట్నూర్ అడిషనల్ ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కై తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.