అనంతపురం జిల్లా విడపనకల్ మండలం చీకలగురికి గ్రామంలో ఉరవకొండ గ్రోమోర్ సెంటర్ ఆధ్వర్యంలో జితార జాతర మరియు సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ ఒకేచోట చేరి సంప్రదాయ పండుగ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు, డాన్స్ సందడితో మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ ఏ.డి సత్యనారాయణ, కోరమండల్ కోఆర్డినేటర్ దినేష్ రెడ్డి, శ్యామ్ సుందర్, జోనల్ మేనేజర్ కిషోర్, ఏరియా మేనేజర్ అశోక్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ సాయి సృతన్ రెడ్డి, మేనేజర్ ఉమామహేశ్వర్, ఫీల్డ్ స్టాఫ్ సురేష్, గ్రోమోర్ ప్రతినిధులు.