మేడిపల్లి: ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ప్రభుత్వ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.గురువారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఇటివల మంజూరు అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతుల ప్రారంభోత్సవనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హజరయ్యారు..అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందజేశారు..పోరుమల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడలేశ్వర స్వామి వారి బోనాల జాతరలో పాల్గొన్నారు. మేడిపల్లి మండల ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.