పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో షెడ్యూల్ విడుదల చేశారు.పెద్దపల్లి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని , నాణ్యమైన పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, సన్న రకం ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ సైతం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.