ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో కార్యాలయంలో పార్లమెంట్ నోటిఫికేషన్ ను నోటీస్ బోర్డ్ లో అతికించిన ఆర్డిఓ వెంకన్న
స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ పత్రాలను కార్యాలయ నోటీసు బోర్డులో స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో ధర్మసోత్ వెంకన్న మధ్యాహ్నం 2 గంటలకు అతికించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకన్న మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేవారు. ఎన్నికల నియమాలు తెలుసుకునేందుకు నోటీసు బోర్డులో అతికించినట్లు తెలిపారు. ఈనెల 18 నుండి 25 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, కార్యాలయ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు హనుమకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయవచ్చని ఆయన తెలిపారు.