దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అయితే లక్ష మందికి ఉద్యోగాలు
దుగరాజుపట్నం వద్ద పోర్టు ఏర్పాటు అయితే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై నిర్వహించిన ధర్నాలో చింతామోహన్ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు వేలాదిమంది ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకీ అధికమవుతుందన్నారు.