యువత క్రికెట్ బెట్టింగ్ ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Mar 31, 2026
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ ఆడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ హర్షవర్ధన్ రాజు యువతకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో బెట్టింగ్స్ ఆడించే వారిపై జూదం ఆడే వారిపై నిఘా ఉంచామని తెలిపారు. ఇప్పటికే బెట్టింగ్స్ మరియు జూదం ఆడే వారిని గుర్తించి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు. యువత క్రికెట్ ని వినోదానికి మాత్రమే చూడాలని జూదానికి కాదని ఎస్పీ యువతల కోరారు.