సంగారెడ్డి: ప్రజావాణిలో 76 దరఖాస్తులు, వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 76 దరఖాస్తులు వచ్చినట్లు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్డిఓ పద్మజారాణి, ఆఫీసర్లు పాల్గొన్నారు.