ములుగు: ఏటూరునాగారంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు, భారీ ర్యాలీ
Mulug, Mulugu | Sep 14, 2025 ఏటూరునాగారంలో ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం జమా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థన అనంతరం పుర విధుల్లో జెండాలు చేత పట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. జామా మసీదు బోదకుడు రెహమాన్ మాట్లాడుతూ.. మమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడవాలన్నారు. సమాజంలో మనిషికి సహాయం చేయడం, ఆకలి తీర్చడం, ప్రేమ పంచడం అలవర్చుకోవాలన్నారు. అజ్మత్, ఫయాజ్, మినహజ్, అజహర్, గాయాజ్ పాల్గొన్నారు.