కంబదూరు మండలం కూరాకులపల్లి గ్రామానికి చెందిన నిందితుడు శ్రీనివాసులు ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నవంబర్ 12,2024 లో కూరాకులపల్లి గ్రామంలో శ్రీనివాసులు అకారణంగా అదే గ్రామానికి చెందిన వెంకటస్వామిని కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. నిందితుడు ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడు. ఎస్ఐ లోకేష్ నిందితుడు శ్రీనివాసులును అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరపరచుగా జడ్జి రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్సై లోకేష్ కుమార్ చెప్పారు.