విజయనగరం: పేదరిక నిర్మూలనే పి4 కార్యక్రమం ప్రధాన లక్ష్యం: జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్
పేదరిక నిర్మూలనే పి4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని కోరారు. పి4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై, సచివాలయ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన ఎంఓటిలు, టిఓటిలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జెసి మాట్లాడుతూ పి4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.