శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన కాన్వొకేషన్లో పాల్గొన్న ఆయన.. 2047 నాటికి భారతదేశం నెంబర్-1 స్థానంలో ఉంటుందన్నారు. ఏ యూనివర్సిటీలోనూ కనిపించనంత క్రమశిక్షణ, నిబద్ధత ఈ సంస్థలో కనిపించిందన్నారు. కాన్వొకేషన్లో క్రమశిక్షణ పాటిస్తూ, విద్యార్థులు నేలపై కూర్చోవడం ఇక్కడే చూస్తున్నానన్నారు.