కుప్పం: అక్రమ లేఅవుట్లు, సైట్లను క్రమబద్ధీకరించుకోవాలి : పీకేయం కూడా చైర్మన్ సురేష్ బాబు
కుప్పంలో ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లు, సైట్లను క్రమబద్ధీకరించుకోవాలని పీకేఎం ఉడా ఛైర్మన్ డాక్టర్ సురేశ్ బాబు సూచించారు. BPS, LRS పథకాలకు సంబంధించి కుప్పం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అలాంటివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.