సంగారెడ్డి: ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏడు రోజుల దత్త పారాయణం ప్రారంభం
దత్త జయంతి సందర్భంగా సంగారెడ్డి మండలం అసలు వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏడు రోజుల దత్త పారాయణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. 78 మంది భక్తులకు పీఠాధిపతి శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి దత్త దీక్షను ఇచ్చారు. ఏడు రోజులపాటు దత్త పారాయణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పారు. డిసెంబర్ 1వ తేదీన మూడు రోజుల పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.