విజయనగరం: విజయనగరం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 14 నామినేషన్లు దాఖలు
జిల్లా అంతటా మూడో రోజు శనివారం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14 నామినేషన్లు దాఖలు అయ్యాయి. విజయనగరం ఎంపి స్థానానికి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి విజయనగరంలో వైసిపి అభ్యర్ధిగా కోలగట్ల వీరభద్రస్వామి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కోలగట్ల వెంకటరమణి వైసిపి తరపున మూడు సెట్లను, మల్లాప్రగడ బుచ్చి గురునాధశర్మ యుగతులసి పార్టీ తరపున ఒక సెట్ దాఖలు చేశారు.