ధర్మారం: ప్రభుత్వ బడిలో ఘనంగా ఫ్రూట్స్ డే వేడుకలు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులకు ఫ్రూట్స్ పై అవగాహన కల్పించారు. కలర్ టెస్ట్ ,నేమ్స్ ఫ్రూట్స్ పై పాఠశాలలో చదువుతున్న ఒకటవ, రెండవ తరగతి విద్యార్థులకు వారి తల్లి తండ్రులు సమక్షం లో ఫ్రూట్స్ గురించి విద్యార్థులచే చెప్పించారు. వాటి రంగు, పండ్ల పేర్లు విద్యార్థులు దానికి సంబంధించిన ఫోటో తో వివరించారు.విద్యార్థుల కండ్లకు గంతలు కట్టి ఫ్రూట్స్ ముక్కలు నోట్లో పెడితే దాన్ని తిని పండు పేరు చెప్పించారు.