గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బొల్లారం డివిజన్ మల్లన్న బస్తీలో అక్రమంగా నిల్వ ఉంచిన 318 మాంజా బండిళ్లను సీజ్ చేసి, ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణాంతకమైన ఈ దారాన్ని ఎవరూ వాడకూడదని సూచించారు.