కొత్తగూడెం: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి... టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జర్నలిస్ట్ లు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జర్నలిస్టులో గింటిస్థలాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇంటి స్థలాలు మంజూరు తో పాటు డబల్ బెడ్ రూమ్ ఇల్లులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అవి అన్ని హాస్పిటల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలని కోరారు.