మేడ్చల్: కార్తీక మాస సమారాధనోత్సవాలలో పాల్గొన్న కూకట్పల్లి టిపిసిసి అధ్యక్షులు బండి రమేష్
కార్తీక మాస సమారాధనోత్సవాలలో భాగంగా కూకట్పల్లిలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థానంలో టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మహావిష్ణువుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.