కనేకల్ మండల కేంద్రంలోని నేషనల్ స్కూల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ జనరేటర్ బాక్స్ నుండి భారీ మంటలు వచ్చాయి. పేలుడు కూడా సంభవించింది. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భారీగా పొగ కమ్మేసి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.