దోమల నివారణ చర్యల్లో భాగంగా ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ లో చెరువులు, కుంటల వద్ద ఎంటమాలజీ విభాగం చర్యలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో సీనియర్ ఎంటమాలజిస్టు పర్యవేక్షణలో డి నరసింహులు సిబ్బందితో కలిసి పరికి చెరువు, అంబీర్ చెరువు, నిజాంపేట్ కింద కుంట, అలీ తలాబ్ చెరువులో లార్వా డెన్సిటీ చెక్ చేసి, దోమల గుడ్లు, పిల్లల నివారణ కోసం చర్య చేపట్టినట్లు తెలిపారు.