ముధోల్: భైంసాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన.
Mudhole, Nirmal | Sep 21, 2025 నిర్మల్ జిల్లా భైంసా పట్టణలో భైంసా పార్టీ గ్రామానికి వెళ్లి రోడ్డు పక్కకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు.తమకు 4 ఏళ్ల క్రితం డబుల్ బెడ్ రూం లబ్దిదారులుగా ఎంపిక చేసిన ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదని ఆందోళన చేశారు.పలు మార్లు ధర్నాలు , ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు.అద్దె ఇండ్లలో అద్దెలు కట్టుకోక నానా ఇబ్బందులు పడుతున్నమని వాపోయారు.ఇప్పటికైన అధికారులు స్పందించకపోతే తామే ఇండ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.