ధర్మపురి: శారదాంబ దేవి బ్రహ్మచారిని రూపంలో దర్శనం...
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైనా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన అమ్మవారు, మంగళవారం రోజున శారదాంబ దేవి బ్రహ్మచారిని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం పంచామృతాలతో వేదపండితులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. శారదాంబ దేవి బ్రహ్మచారిని రూపంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.