చిట్టమూరులో ఆధార్ కేంద్రం ప్రారంబించిన తహశీల్దార్ నరేష్ MPDO ఉమామహేశ్వరరావు
Gudur, Tirupati | Nov 15, 2025 చిట్టమూరు సచివాలయం వద్ద ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ నరేశ్ శనివారం ప్రారంభించారు. గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లి ఆధార్ కార్డు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసం స్థానికంగానే ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. టీడీపీ నాయకుడు గణపర్తి కిషోర్, సొసైటీ అధ్యక్షుడు కస్తూరయ్య యాదవ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.