సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదు మందిని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.4,160 నగదురు స్వాధీనం చేసుకొని వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయించామని టాస్క్ పోస్టల్ సిఐ సుధాకర్ రావు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.