కనిగిరి: పామూరు మండలంలోని బోట్ల గూడూరు గ్రామంలో ఆటో డ్రైవర్ మహర్షిని గ్రామస్తులు విచక్షణ రైతంగా స్తంభానికి కట్టివేసి దాడి చేసిన సంఘటన తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ మహర్షిని చికిత్స నిమిత్తం కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైద్యశాలలో చికిత్స పొందుతున్న మహర్షిని పరామర్శించారు. మహర్షికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మహర్షికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.