మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఇంచార్జ్ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. 2029 ఎన్నికలలో మరో మారు సీఎం గా జగనన్నే గెలుస్తారని కూటమి ప్రభుత్వం వేధింపులకు భయపడవలసిన అవసరం లేదని నాగార్జున రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అతి త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో మన పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీల నియామకం పూర్తి చేశారు.