రాయదుర్గం: ఉద్యమ స్ఫూర్తితో జనసేన సభ్యత్వ నమోదు : ఆహుడా చైర్మన్ వరుణ్, హరిప్రసాద్
ఉద్యమ స్ఫూర్తితో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆహుడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, హస్తకళల కార్పోరేషన్ చైర్మన్, జిల్లా జిల్లా సమన్వయకర్త పసుపులేటి హరిప్రసాద్ లు పిలుపునిచ్చారు. రాయదుర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనసేన సభ్యత్వం భద్రతకు ప్రామాణికం అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సారద్యంలో కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు తెలిపారు.