జూలూరుపాడు: వైరా నియోజకవర్గం వ్యాప్తంగా సిపిఎం పార్టీ రాబోయే ఎన్నికల్లో బరిలో ఉంటుంది
నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులను స్థానిక ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ వైరా నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా వీరభద్రం తెలిపారు. శనివారం సిపిఐ(ఎం) వైరా నియోజకవర్గం కమిటీ సమావేశం స్థానిక బోడెపూడి భవనంలో డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించక పోవడం వలన స్థానిక సంస్థలకు పాలక మండలి లేక అధికారుల పరిపాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారు.