శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద పలు వార్డుల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు స్వయంగా సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.