అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో చలి మరింత తీవ్రం,
సాయంత్రం అయిందంటే చాలు..ఆసిఫాబాద్ జిల్లా చలితో గజగజా వణికిపోతోంది. ఉదయం ఎనిమిది గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతోంది. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అతి తక్కువగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యులో 7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. దీంతో పాటు పలు మండలాలు చలి గుప్పిట చిక్కుకున్నాయి.