భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో ‘జనగణన–2027’ మొదటి దశ (ఇళ్ల జాబితా మరియు గృహ గణన – HLO) శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఓ. ఆనంద్ గారు ఉత్తర్వులు జారీ చేశారనీ, సదరు శిక్షణను ఫలవంతంగా మార్చి03 నుండి 5 వరకు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోల సంబంధిత అధికారులకు సూచించారు.శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని కలెక్టరేట్ లోని డిఆర్ఓ చాంబర్ నందు సెన్సస్ 2027 నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు.