చిల్కానగర్ డివిజన్లో సిసి రోడ్లు, కొత్త డ్రైనేజ్, స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లు, నీటి లైన్ల వంటి మౌలిక సదుపాయాల కోసం బస్తివాసులు సమర్పించిన వినతి పత్రాలను దశలవారీగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ బండాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశమై ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని భరోసా ఇచ్చారు.