ప్రపంచ భాష గొప్ప కవులు ఐక్యరాజ్యసమితి యునెస్కో యోగివేమనలను గుర్తించడం మనందరికీ గర్వకారణమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో సోమవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగివేమన జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎంపీలతో పాటు ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగి వేమనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.