తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మేడ్చల్ పాస్టర్లు, మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో, సంజీవ తెనాలి, కోఆర్డినేటర్ మిట్టు ప్రణీత్ కుమార్ అలా ఆధ్వర్యంలో వజ్రష్ యాదవ్ ను కలిసి పూజలు చేశారు. అనంతరం పాస్టర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.