శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం జి సి డి ఓ అనిత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టగా జిల్లాలోని అన్ని కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.