పార్వతీపురంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
పార్వతీపురంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు చినబొండపల్లి గ్రామానికి చెందిన జి. గుంపస్వామి గా గుర్తించారు. మరో ఇద్దరు మెంటాడ మండలం పసుపువాని వలస గ్రామానికి చెందిన సింహాద్రి, సాయికుమార్ ఈ ఘటనపై పార్వతీపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.