హిమాయత్ నగర్: ఇందిరగాంధీ మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి
నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారని అన్నారు. అనంతరం ఆయన ఐదు జిల్లాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలకు చిరలని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కొండ సురేఖ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.