మార్కాపురం: బోడపాడు నుంచి పెద్ద యాచవరం వరకు తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం మండలం బోడపాడు గ్రామం నుంచి పెద్ద యాచవరం వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా కోటి యాభై లక్షలు రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు.