ధర్మారం: ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడారం పీ.హెచ్.సీ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరం,
ధర్మారం మండలం కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సమగ్ర ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో సాధారణ వ్యాధులతో పాటు హెచ్ఐవీ, టీబీ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు డాక్టర్ గౌతమ్ తెలిపారు.