సిర్పూర్ టి: సిర్పూర్ టి రైల్వే స్టేషన్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన ఎమ్మెల్యే
సిర్పూర్ రైల్వే స్టేషన్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనుల విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపట్టాలని భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సిర్పూర్ టి వరకు పొడిగించాలని కోరినట్లు ఎమ్మెల్యే పాల్వయ్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు,