తాడిపత్రి లోని పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మాఘమాసం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి, పార్వతి దేవి లకు విశేష పూజలు చేశారు. అర్చనలు, అభిషేకాలు, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.