చస్తే పూడ్చుకోవడానికి శ్మాశానాలు కరువయ్యాయని ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు శ్మాశాన వాటికల సాధన కోసం జీపు యాత్ర నిర్వహిస్తున్నట్లు వివిధ కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.కార్యక్రమంలో ఐఎప్ టీయూ జిల్లా కార్యదర్శి బి సురేష్,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సుగామంచి శ్రీనివాసులు,ఐఎంఎం బాషా,బేడ బుడగ జంగం రాష్ట్ర కార్యదర్శి శిరిశాల అంజి తదితరులు పాల్గొన్నారు.