సూళ్లూరుపేటలో ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం దాడుల్లో 45 కేజీలు స్వాధీనం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో మంగళవారం మునిసిపల్ కమీషనర్ చిన్నయ్య పర్యవేక్షణలో ప్లాస్టిక్ నిషేధం పై దాడులు నిర్వహించారు. పట్టణం లోని టిఫిన్ షాపుల్లో, వివిధ రకాల వ్యాపారులు నిషిద్ధ ప్లాస్టిక్ క్యారీ కవర్లు, గ్లాసులు, టిఫన్ ప్లేట్స్ కవర్లు విచ్చల విడిగా వాడుతుండటంతో మునిసిపల్ అధికారులు దాడులు నిర్వహించి 45 కిలోల నిషిద్ధ ప్లాస్టిక్ ను సీజ్ చేయడం జరిగింది. అలాగే నిషిద్ధ ప్లాస్టిక్ ను అమ్ముతున్న, వాడుతున్న వారికి 4200 రూపాయిలు జరిమానా కూడా విధించారు. ఇక పై తరచూ ఇలాంటి దాడులు చేయనున్నట్లు కమిషనర్ చిన్నయ్య తెలియజేసారు.