తొలి ఏకాదశి (ఆషాడ ఏకాదశి) పార్వదినాన్ని పురస్కరించుకొని గుడిహత్నూర్ మండల పి.ఏ.సి.ఎస్ చైర్మన్ సంజీవ్ ముండే కుటుంభం ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్దాలతో నిర్వహించే శ్రీ పాండురంగ దీండి నగర ప్రదక్షణ శోభయంత్రలో బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే తలపై కలశాన్ని పెట్టుకొని భక్తులతో కలిసి పాదయాత్ర చేశారు. భజన సంకీర్తనలు, భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అటు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండగను గుడిహత్నూర్ మండల ప్రజలు నూతన ఉత్సాహంతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు