జూలూరుపాడు: జూలూరుపాడు లోని 118 భగత్ సింగ్ జయంతి వేడుకలు
జూలూరుపాడు మండలంలో ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు•ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్•కె చాంద్ పాషా* మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారత దేశ యువత స్ఫూర్తిదాయకమని,అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలియజేసే భాద్యత పాలకులదేనని వారు అన్నారు.భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు•తక్షణమే భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి యువతకు ఉద్యోగాలు కల్పించాలి